Thursday, May 17, 2012

ammA ani arachinA


చిత్రం: పాండురంగ మహత్యం
గానం: ఘంటసాల
సంగీతం: టీవీ రాజు
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య


అమ్మా నాన్నా

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా

పది నెలలు నను మోసి పాలిచ్చి పెంచీ
మది రోయక నాకెన్నో ఊడిగాలు జేసిన
ఓ తల్లీ నిను నలుగురిలో నగుబాటు జేసితి
తలపకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మ అమ్మా అమ్మా

దేహము విఙ్ఞానమూ బ్రహ్మోపదేశమిచ్చి
ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
కను గానని కామమున ఇలువెడలా నడిపితి
కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా
నాన్నా నాన్నా

మారిపోతినమ్మా నా గతి యెరిగితినమ్మా
మీ మాట దాటనమ్మ ఒకమారు కనరమ్మా
మాతా పిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా
నన్ను మన్నించగ రారమ్మా అమ్మా అమ్మా

యే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము
యే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
యే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరము
యే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము

అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమై
తపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన వేరే
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా, అమ్మా నాన్నా

===================================================


chitram: pAnDuranga mahatyam
gAnam: ghanTasAla
sangItam: TIvI rAju
sAhityam: samudrAla rAghavAchArya

ammA nAnnA

ammA ani arachinA AlakinchavEmammA
AvEdana tIru rOju I janmaku lEdA

padi nelalu nanu mOsi pAlichchi penchI
madi rOyaka nAkennO UDigAlu jEsina
O tallI ninu nalugurilO nagubATu jEsiti
talapakamma tanayuni tappulu kshamiyinchavamma ammA ammA

dEhamu vi~m~nAnamU brahmOpadESamichchi
iha parAlu sAdhinchE hitamichchina tanDrini
kanu gAnani kAmamuna iluveDalaa naDipiti
kanipistE kannILLatO kALLu kaDugutA nAnnA
nAnnA nAnnA

mAripOtinammaa naa gati yerigitinammaa
mI mATa dATanamma okamAru kanarammA
mAtA pita pAda sEvE mAdhava sEvEyani maruvanammA
nannu manninchaga rArammA ammA ammA

yE pAda sIma kASI prayAgAdi pavitra bhUmula kanna vimala taramu
yE pAda pUja ramApati charaNAbja pUjala kannanu puNya tamamu
yE pAda tIrdhamu pApa santApAgni ArpagA jaalina amRta jharamu
yE pAda smaraNa nAgEndraSayanu dhyAnammu kannanu mahAnandakaramu

aTTi pitarula pada sEva Atma marachi iha parambulakeDamai
tapinchuvAri kAvagala vaaru lEru, lEru ee jagAna vErE
nannu manninchi brOvumO ammA nAnnA, ammA nAnnA


jaya jananI

చిత్రం: మనదేశం
గానం: ఘంటసాల, C కృష్ణవేణి
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య


జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ


శీతశైల మణి శృంగ కిరీటా, సింహళ జాంబూ నగ పీఠా
వింధ్య మహీధర మహా మేఖలా, విమల కాశ్మీర కస్తూరి రేఖా


జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ


గంగా సింధూ మహానదీ, గౌతమీ కృష్ణా కావేరీ
క్షీరసార పరిపోషిత కోమల  సస్య విశాలా శ్యామలా


జయ జననీ పరమ పావనీ జయ జయ భారత  జననీ


===============================


chitram: manadESam
gaanam: ghanTasAla, #C# kRshNavENi
sangItam: ghanTasAla
sAhityam: samudrAla rAghavAchArya


jaya jananI parama paavanI jaya jaya bhaarata jananI


SItaSaila maNi SRnga kirITaa, siMhaLa jaambU naga pIThaa
vindhya mahIdhara mahA mEkhalA, vimala kaaSmIra kastUri rEkhA


jaya jananI parama paavanI jaya jaya bhaarata jananI


gangA sindhU mahaanadI, gautamI kRshNA kAvErI
kshIrasAra paripOshita kOmala sasya viSAlA SyAmalA


jaya jananI parama paavanI jaya jaya bhaarata jananI